TwitterWhatsAppFacebookTelegramShare

ఫార్మా కంపెనీకి మా గిరిజన భూములు అడుగుతున్న కలెక్టర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఫార్మా కంపెనీలకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం కొన్ని ప్రధానమైన బలమైన షరతులు విధిస్తున్నాము…. ఫార్మా కంపెనీలకు భూములు ఇస్తే ఫార్మా కంపెనీలో భూములు పోయిన రైతులకు ఫార్మా కంపెనీ డైరెక్టర్లను చేయండి… ఫార్మా కంపెనీలకి చైర్మన్ లను ఎండి లను చేయండి… ఫార్మా కంపెనీల లాభాలలో భూములు పోగొట్టుకున్న రైతులకు వాటాలు పంచండి …ఫార్మా కంపెనీలో పెద్దపెద్ద పోస్టులలో మేమే ఉంటామని చెప్పండి… ఉద్యోగం అంటే అటెండర్ గేట్ కాడ వాచ్మెన్ లేకపోతే మన చదువుకు తగ్గ ఉద్యోగంలో సెక్యూరిటీ గార్డ్ అవి కాదు ఎవరి రైతు భూమి పోతే ఆ రైతు భూమికి ఆ రైతు కుటుంబంలో ఉన్న నిరుద్యోగులకు ఆ కంపెనీలలో జిఎంలను ఏజీఎం లను చేయండి… మనభూమి మనకు ఉంటే అన్నీ ఉంటాయి అసలు భూమి ఉంటే మన సంపద మనమే సృష్టించుకోవచ్చు… రైతులారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫార్మా కంపెనీలను బంజర భూములలో కొండలలో గుట్టలలో ఫార్మా కంపెనీలను పెట్టుకోమనండి భూములు ఇవ్వమనండి.

రామోజీరావు ఫిలిం సిటీ పక్కన కట్టుకోమని చెప్పండి…. రామోజీరావు బంజర భూములను కొండలని గుట్టలని ఎలా తీర్చి దిద్దాడో అసైన్మెంట్ ల్యాండ్లని సెంటు భూమి రెండు రూపాయలకి కొనుక్కొని ఎకరం భూమి 100 రూపాయల నుంచి వెయ్యికి 2000 కి ఎకరం కొని ఎలా అయితే ఇప్పుడు డెవలప్ చేశాడో అక్కడ కూడా బంజర భూములు తీసుకొని ఫార్మా కంపెనీలు కట్టుకోమని చెప్పండి…. మన పంట పొలాలని తీసుకోమని కాదు… ఫార్మా కంపెనీకి ప్రతి రైతు భూమి పోగొట్టుకున్న ప్రభుత్వం బలవంతంగా గుంజుకున్న రైతుకి ఒక డైరెక్టర్ పోస్ట్ ఇయ్యమనండి వాటాలు లాభాలు మనమే పంచుకునేలా మన భూములు పోగో ట్టుకున్న రైతులు ఆ ఫార్మా కంపెనీ మొత్తం మన చెప్పు చేతుల్లో ఉండే విధంగా పెట్టుబడి మాత్రం విదేశీ వాళ్లు పెట్టని ఏమైనా అభివృద్ధి టెక్నాలజీ ఉంటే విదేశీ అభివృద్ధి మన దేశ టెక్నాలజీ అన్ని కలిసి ఫార్మా కంపెనీలను చేయమనండి పని మాత్రం వాళ్ళు చేయమని చెప్పండి… విదేశీ యంత్రాంగం స్వదేశీ యంత్రాంగాన్ని వాడమని చెప్పండి…. కార్మికులు శ్రామికులు రైతులు అందరం కలిసి పని చేద్దాం…. మన లాభం మన దగ్గర డబ్బులు మన వాటాలు మనమే పంచుకోవాలి.

ఇక్కడ భూములు పోగొట్టుకొని ఇక్కడ కూలీలుగా పనిచేసి లాభాలు మాత్రం విదేశాలకు తీసుకెళ్తాం అంటే మాత్రం కుదరదు…. మీకు ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఫార్మా కంపెనీ వల్ల వచ్చే పొల్యూషన్ మన ప్రజలు మన తెలంగాణ రైతులు మన తెలంగాణ నీటి వనరులు మొత్తం నాశనం అయిపోయి మరియు మన రైతులు భూములు పోగొట్టుకొని ఇంటికో ఉద్యోగం అంటారేంటి పిచ్చోళ్ళ లాగా భూమికి భూమి ఇవ్వమంటారు ఏంటి? పంట పొలాల భూములను గుంజుకొని ఎక్కడో బంజరు భూమి ఇస్తా మన పంట పొలాలను తీసుకొని బంజరు భూమి ఇస్తే మనం ఏం చేద్దాం ఆ బంజర భూములలో పంటలు పండక నీటి వసతులు లేక బోర్లు వేసిన బోర్లు ఎండిపోయి బోర్లు పడక ఆ బంజర భూముల రాళ్లతో కొట్టుకొని మనం చచ్చిపోదామా… ఇల్లుకు ఇల్లు ఇవ్వమంటారు ఎక్కడో ఊరవుతల ఇస్తే పుట్టకొకడు గుట్టకొకడు వెళ్లిపోదామా మన తాత ముత్తాతలు పుట్టిన ఊరులు వదులుకొని ఎక్కడో అనాధల్లాగా . పుట్టకొకడుకు ఊరుకొకడు చెట్టుకొకడు గుట్టకొక్కడు వేరే ప్రాంతాలకు వేరే ఊర్లకు వలస పోదామా ఇంత పెద్ద ఊర్లు మన తాత ముత్తాతలు సంపాదించిన భూములను వదిలిపెట్టుకొని వెళ్లిపోదామా.

ఎకరం భూమి కోటి రూపాయలు ఇవ్వమంటున్నాం ఏం చేద్దాం మంచిగా తాగి తిని కార్లు కొనుక్కొని మళ్లీ అవేకారులు అమ్మి వేసి ఆ కార్లకే డ్రైవర్లు అవుదామా చెప్పండి… మనం భూములు ఇచ్చేది లేదు ఒకవేళ భూములు ఇస్తే ఆ ఫార్మా కంపెనీకి ఎంతమంది రైతుల భూములు పోయాయో పోతున్నాయో ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి గుంజుకుంటుందో అంతమంది రైతులు డైరెక్టర్లుగా ఉంటారు…. ఆ ఫార్మా కంపెనీ పెడితే ఎంత లాభం వస్తుందో ఆ లాభం మొత్తం మన డైరెక్టర్లు మన భూములు పోగొట్టుకున్న రైతులు పంచుకోవాలి.. మన సంపద మనకే దక్కాలి …మన భూములు పోగొట్టుకొని మన దేశ సంపద అంబానీ ఆదానీలకు వేరే వేరే విదేశీ కంపెనీల ఫార్మా కంపెనీల పెట్టుబడుదారులకు పోయి విదేశాలలో స్విస్ బ్యాంకులలో దాచి పెట్టుకోకూడదు…. మారండి భారతదేశ పాలకులారా తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలారా యువకుల్లారా మహిళలారా నాయకుల్లారా, భారత రాజ్యాంగ చదవండి.. తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలు భూములు ఇవ్వకూడదు…

అభివృద్ధి జరగాలి కానీ భూమి ఇస్తే ఆ ఫార్మా కంపెనీలో భూములు పోగొట్టుకున్న రైతులంతా డైరెక్టర్లుగా మారాలి ఆ డైరెక్టర్లు ఆ ఫార్మా కంపెనీ లాభాలన్నీ ఆ పోగొట్టుకున్న భూములు పోగొట్టుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వాలి తద్వారా రైతుల ఆదాయ మార్గాలు పెరగాలి… భూమి పోయినందుకు భూమి పోయిన రైతుకు ఉద్యోగం అంటే డే వాచ్మెన్ నైట్ వాచ్మెన్ గెట్ వాచ్మెన్ ఆఫీసులో అటెండర్ లేకపోతే ఆఫీసులో క్లర్క్ ఉద్యోగం కాదు రైతుకు భూమి పోతే ఆ ఫార్మా కంపెనీ డైరెక్టర్ పోస్టు ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్లు రావాలి…. ఇది భారత రాజ్యాంగం సారాంశం…. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి…. బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న పారిశ్రామిక విధానం.. అంతేగాని మనం భూములు పోగొట్టుకొని ఇల్లులు మరి వేరే కాడ బంజరు భూములు వేరే కాడ చెట్టుకొక్కడు పుట్టకొకడు వెళ్లిపోయి ఇల్లులు కట్టుకోవడం కాదు కోటి రూపాయలు కూర్చొని తాగి తందనాలాడీ తింటే కరెక్ట్ గా మూడు నెలల నుండి ఆరు నెలల్లో అయిపోతాయి…. పెద్దపెద్ద కంపెనీ కార్లు కొనుక్కుంటే మూడు కార్లకి కోటి రూపాయలు అయిపోతాయి…. ఆలోచించండి నిరుద్యోగులారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో మేధావి వర్గం ప్రజలారా యువకులారా…

ఇట్లు మీ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం…. పై విధంగా ఆలోచించండి పై విధంగా రైతులు గ్రామసభల్లో అధికారులకు ముఖ్యమంత్రులను మంత్రులను కలెక్టర్లను పై విధంగా అడగాలని పిలుపునిస్తుంది. ఎక్కడ గొడవలు పెట్టుకోవద్దు…. దాడులు చేయొద్దు… రాళ్లు రప్పలు పెట్టి కొట్టొద్దు… కర్రలు కత్తులు వాడొద్దు… మాటలే మన ఆయుధాలు… ఒక తెల్ల పేపర్ మీద ఈ డిమాండ్లన్నీ రాసి భారత దేశ రాష్ట్రపతికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మన తెలంగాణ ముఖ్యమంత్రి కి ఫార్మా కంపెనీ కోసం భూములు పోగొట్టుకుంటున్న మన ఊరి ప్రజలంతా సంతకాలు పెట్టి ఇవ్వండి…. కలెక్టర్లకు ఇవ్వండి…. మంత్రులకు ఎమ్మార్వోలకు ఆర్డీవోలకు ఇవ్వండి… మన భారత రాజ్యాంగమే మన పెద్ద ఆయుధం… మన రైతుల మాటే అక్షర రూపంలో తూటాలాగా పేలాలి …మన మాటే మన హక్కు… జై భీమ్….. జై బాబాసాహెబ్ అంబేద్కర్….. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి…..

వ్యాసకర్త కోట శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం తెలంగాణ రాష్ట్రం సెల్ నెంబర్ 9394809649

Loading

By admin

Exit mobile version