సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వీడియోలు, పోస్టులపై కేసులు నమోదైన నేపథ్యంలో, సినీనటి శ్రీరెడ్డి మంత్రి లోకేశ్‌ను ఉద్దేశించి బహిరంగ లేఖ విడుదల చేశారు. లేఖలో లోకేశ్‌ను “అన్నా” అని సంబోధిస్తూ, తన తప్పును అంగీకరించారు. ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు తెదేపా, జనసేన కార్యకర్తలకు బాధ కలిగించాయని, వారికి క్షమాపణలు తెలిపారు. తమ కులదైవం వెంకటేశ్వరస్వామిని సాక్షిగా ప్రమాణం చేసి, ఇకపై అలాంటి చర్యలు చేయనని తెలిపారు.
అంతేకాక, చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం, హోంమంత్రి, మీడియాను క్షమించమని విజ్ఞప్తి చేశారు. శ్రీరెడ్డి ఈ లేఖను ఎక్స్ వేదికగా “ప్లీజ్ అన్నా అడుక్కుంటున్నా.. నన్ను కాపాడు” అంటూ పోస్ట్ చేశారు. అదే సమయంలో, మాజీ సీఎం జగన్‌కు కూడా లేఖ రాస్తూ, తన చర్యల వల్ల వైకాపాకు నష్టం కలిగితే ఆ పాపం జగన్‌కు అంటుకుదోమనేది తన ఉద్దేశం అని పేర్కొన్నారు. అందుకే పార్టీ, కార్యకర్తల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.