TwitterWhatsAppFacebookTelegramShare

కొడంగల్ నియోజకవర్గం గ్రామాలు రోటిబండ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఐదు తండాలు మరియు లగచర్ల పీర్లపల్లి తదితర గ్రామాల ప్రజలకు భూములను ఫార్మా కంపెనీ పేరుతో గుంజుకోవాలనుకోవడం ప్రభుత్వానికి తగదు ప్రజల అభిప్రాయం లేకుండా ఫార్మా కంపెనీలకు భూములను కట్టబెట్టాలి అనే కుట్రను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ ముందు నుంచి డిమాండ్ చేస్తున్న ది ఈరోజు అక్కడి ప్రజలకు సమాచారం ఇవ్వకుండా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కాడ అధికారి , తహసీల్దార్,500 మంది పోలీసులతో ప్రజాభి ప్రాయ సేకరణ పేరుమీద అక్కడి రైతుల పైన విపరీతంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అధికారులు వివరించిన తీరును తీరంగా ఖండిస్తున్నాం, కావాలనే అక్కడి ప్రజలను రెచ్చగొట్టి అధికారులు వారి పైన కేసులు పెట్టాలని ఒక దుర్భివృద్ధితో వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.

జిల్లా అధికారులు పోలీసులతో ముక్కుమూడిగా మీ ఫార్మ కంపెనీలకు మి భూములు ఇవ్వాల్సిందే అని అనడంతో అక్కడి ప్రజలు ఆఫీసర్ల పై తిరుగుబాటు చేశారు, కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతం నుండి ఫార్మా కంపెనీలను వెనక్కి తీసుకోవాలని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది, దాడి నెపంతో అక్కడ ఉన్న ప్రజలపై రైతులపై లంబాడి ప్రజలపై యువకులపై తప్పుడు కేసులను నమోదు చేసి ఈ ఫార్మా కంపెనీలకు భూములులను ను కట్టబెట్టాలని చూస్తున్నది, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని లంబాడి హక్కుల పోరాట సమితి విజ్ఞప్తి చేస్తున్నది.

వెంటనే ఈ ప్రాంతం నుండి ఫార్మా కంపెనీలను వెనక్కి తీసుకొని శాంతియుత వాతావరణంలో ప్రజలను సముదాయించి ఆ ప్రాంతాన్ని సందర్శించాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం మీ సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఇలాంటి గొడవలను అధికారులు సృష్టించడం అక్కడి రైతులను ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదని కావున రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి ప్రజా వ్యతిరేక అభిప్రాయ సేకరణలు చేయకూడదని సేవాలాల్ సేన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా అధికార ప్రతినిధిబానోతు నాగరాజు నాయక్,జిల్లా కార్యదర్శి బాధవత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Loading

By admin

Exit mobile version