TwitterWhatsAppFacebookTelegramShare

ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో సేవాఘడ్ సేవాలాల్ గుడి యందు సేవాలాల్ ధర్మ జాగరణ సేన సద్భావన సమావేశం సేవాలాల్ సేన జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతన జరిగింది, ఈ సమావేశానికి సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సెంట్రల్ కమిటీ చైర్మన్ ధరావత్ ప్రేమ్చంద్ నాయక్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, టీఎస్ టిటిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 26వ తారీకు నుండి జరిగే రగ్ జోళ్ యాత్రకు తండా నుండి భారీ ఎత్తున తండా ప్రజలు టేకులపల్లి మండలంలో ఉన్న సేవాఘడ్ సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ టెంపుల్ నుండి ప్రారంభం అవుతున్నది కాబట్టి చుట్టుపక్క తండాల నుండి గిరిజన లంబాడి బిడ్డలు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు, ఈ యాత్రలో అనేక సమస్యలపై ఆయా జిల్లాలలో ఉన్న మేధావి వర్గాలతో చర్చ జరపడం జరుగుతుందని అన్నారు, ఈ రగ్ జోళ్ యాత్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఈ యాత్ర 9 జిల్లాలలో మొదటి విడతగా జరుగుతుంది, కాబట్టి ఈ తొమ్మిది జిల్లాల తండాలలో ఉన్న మన లంబాడి జాతి బిడ్డలు ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరారు అనంతరం సేవాలాల్ సేన జిల్లా నాయకులను అనుబంధ కమిటీ నాయకులను మండల కమిటీ నాయకులను పదవులు ఇవ్వడం జరిగింది వాటితో పాటు నియామక పత్రాలను ఇవ్వడం జరిగింది,

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన జిల్లా కోశాధికారిగా జరపలా లాలూ నాయక్, సేవాలాల్ సేన టేకులపల్లి మండల అధ్యక్షులుగా బానోత్ కిషన్ నాయక్, యువసేన అధ్యక్షులు జబ్బర్ సింగ్, ప్రచార కార్యదర్శిగా భూక్యా నవీన్ నాయక్, టేకులపల్లి మండలం లో ఉన్న సేవాఘడ్ గుడి పూజారిగా సేవల్ శ్రీ గణేష్ పూజారి ను నియమించడం జరిగింది , సేవాలాల్ ధర్మజాగరణ సేన జిల్లా అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షుడు గా సేవల్, ఉపాధ్యక్షులుగా తేజావత్ వీరన్న, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కార్యదర్శిగా సుజాత బాయ్, ప్రచార కార్యదర్శిగా సేవల్ శ్రీ గణేష్ ప గూనోత్ రావ్, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్, రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్, బిజెపి జిల్లా నాయకులు పుణ్య నాయక్ , ధర్మజాగరణ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జరుపల రామచంద్రనాయక్, ధర్మ జాగరణ సేన ప్రధాన కార్యదర్శి జరపల మంగీలాల్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ రమేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, ఇల్లందు మండల అధ్యక్షులు వాంకుడోత్ రమేష్ నాయక్, పాల్వంచ మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయక్, లక్ష్మీదేవి మండల అధ్యక్షులు బోడ బాలు నాయక్, సేవాలాల్ సైనికులు, ధర్మజాగరణ సేన సైనికులు, తదితరులు పాల్గొన్నారు

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version