సింగరేణిలో డిపెండెంట్ కింద ఎవరు చేరినా మొదటి ఐదేళ్లు తప్పనిసరిగా భూగర్భంలోకి దిగి పని చేసేలా కొత్త నిబంధనలు తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇదివరకు ఈ తరహా నిబంధనలు ఉన్నా మెడికల్ రిపోర్టులు, పైరవీలు, సంఘాల పేరు చెప్పుకొని అండర్ గ్రౌండ్ నుంచి వచ్చి సర్ఫేస్‌లో తిష్ట వేస్తున్నారు. దీంతో లోపల దిగి పనిచేసే వారు కరువయ్యారు. ఇకముందు అలా జరుగుండా కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. విధివిధానాలు తయారు చేయాల్సి ఉంది. సర్ఫేస్‌లో ఖాళీలు ఉంటే ఆ డిజిగ్నేషన్లకు రావడానికి ఇక కనీస అర్హత అండర్‌గ్రౌండ్‌ల్‌లో ఐదేళ్లు పని చేయాలనే నిబంధన తప్పని సరిచేసే అవకాశం ఉందని తెలిసింది.