TwitterWhatsAppFacebookTelegramShare
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీనియర్ సిటిజన్స్ ని పట్టించుకోవాలి
  • బస్సు, రైల్వే ప్రయాణాల్లో రాయితీ కల్పించాలి
  • ఆసరా పెన్షన్ మంజూరు చేయాలి

ఈరోజు 27-09-2024 శుక్రవారం ఉదయం 10:30 గం:లకు (01-10-2024) అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా జిల్లా మహిళా,శిశు, వికలాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ వారు వరప్రసాద్, నరేష్ గార్ల ఆధ్వర్యంలో జరిగిన వారోత్సవాళ్ళో భాగంగా కొత్తగూడెం ,పోస్టాఫీసు సెంటర్ నుండి బస్టాండ్ వరకు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, విద్యానగర్, మరియు వివిధ ఆర్గనైజేషన్లతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ…

దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ సిటిజన్స్ అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని, ఉచితంగా వైద్య సేవలు, బస్సులు, రైల్వే లలో యాభై శాతం రాయితీ ఇవ్వాలని, మరియు లక్షా యాభై వేల రూపాయల లోపు ఆదాయం వున్న సీనియర్ సిటిజన్స్ కు ఆసరా పెన్షన్ లు మంజూరు చేయాలని కోరారు. ఈ అసోసియేషన్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్,T పాండురంగారావు, శివరామక్రిష్ణ, Dr బత్తుల కృష్ణయ్య, ధర్మారావు, మైనేని నాగేశ్వరరావు, మోహన్ లాల్ కేశవరావు, కామేశ్వరరావు, జోసెఫ్, రాజేంద్రప్రసాద్, గురుమూర్తి, కేశవర్ధన్ నసీరుల్లా, అంజనానందం, తోట సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin

Exit mobile version