TwitterWhatsAppFacebookTelegramShare

ద‌స‌రా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిర‌మ్మ క‌మిటీలు ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని స్థాయిల్లో క‌మిటీల ఏర్పాటుకు ఒకట్రెండు రోజుల్లో విధివిధినాలు రూపొందించాల‌ని సూచించారు. అర్హులు అందరికీ ఇందిర‌మ్మ ఇళ్లు ద‌క్కాల‌న్నారు.

🔺ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు.

🔺ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న కింద ఇత‌ర రాష్ట్రాలకు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఇళ్లు మంజూరు అవుతుంటే, తెలంగాణకు ఎందుకు ఆ స్థాయిలో కేటాయింపులు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. కేంద్రం మంజూరు చేసే గృహాల్లో ఈసారి రాష్ట్రానికి గ‌రిష్ట సంఖ్య‌లో సాధించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

🔺ఇళ్ల విషయంలో కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని, డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు.

🔺రాజీవ్ స్వగృహలో నిర్మించి ఏళ్ల తరబడి వృథాగా ఉన్న బ్లాక్‌లు, ఇళ్లు వేలం వేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు.

🔺డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల ల‌బ్ధిదారుల ఎంపిక పూర్త‌యినా వాటిని అప్ప‌గించ‌కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల‌కు ఆ ఇళ్ల‌ను అప్ప‌గించాల‌న్నారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో నిర్మించి నిరుప‌యోగంగా ఉన్న బ్లాక్‌ల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పించి, అర్హులైన ల‌బ్ధిదారుల‌కు అప్ప‌గించాల‌ని చెప్పారు.

Loading

By admin

Exit mobile version