ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఇండియా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని భావిస్తున్నారు. AutoNxt స్టార్టప్, కుబోటా, మహీంద్రా, HAV, సోనాలికా కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ ట్రాక్టర్ నమూనాలు చూపించాయి. AutoNxt కంపెనీ లెవల్ 3 అటానమస్ టెక్నాలజీతో డ్రైవర్ లెస్ ట్రాక్టర్‌ను రూపొందిస్తోంది. CEO కౌస్తుభ్ ధోండే ప్రకారం, ఈ ట్రాక్టర్ డీజిల్ ట్రాక్టర్ కంటే తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో రూ.14/km మాత్రమే ఖర్చవుతుందని చెప్పారు. 2025 నాటికి 100 ఈ-ట్రాక్టర్లు మార్కెట్లోకి విడుదల చేయాలనే లక్ష్యంతో AutoNxt కంపెనీ ముందుకుసాగుతోంది.