భారత్‌లో తొలి మంకీ పాక్స్ కేసు నమోదు. ఢిల్లీలో ఇద్దరికి మంకీ పాక్స్ లక్షణాలు కనిపించాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ రెండు కేసులు వైద్య పరీక్షల్లో నిర్ధారణకు వచ్చాయి. బాధితులను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంకీ పాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. తొలి కేసు వెలుగు చూడడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీ చేసి, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన వైద్యం అందించాలని రాష్ట్రాలను ఆదేశించింది