హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన “చేనేత అభయహస్తం” లోగోను ఆవిష్కరించారు. నేతన్నకు చేయూత పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.290 కోట్ల నిధులు విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంతో పాటు, వారి ఆర్థిక స్థితి బలోపేతం చేయడమే లక్ష్యమని సీఎం అన్నారు.