విశాఖలో వర్షాలు, వరదల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు యంత్రాంగానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. GVMC, పోలీస్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. GVMC కమిషనర్ నివేదిక ప్రకారం, 80 పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. వర్ష ప్రభావం గురయ్యే 14,630 కుటుంబాలను గుర్తించామనీ, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. వాతావరణశాఖ ప్రకారం, వాయుగుండం కళింగపట్నానికి తూర్పు-దక్షిణ దిశలో 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూరికి దక్షిణ ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల సమీపానికి చేరిన ఈ వాయుగుండం రేపు ఉదయానికి తీవ్రవాయుగుండంగా మారవచ్చని తెలిపారు. వేగంగా పయనిస్తున్నందున రేపు మధ్యాహ్నానికి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.