TwitterWhatsAppFacebookTelegramShare

భూ కంపం వచ్చినా..ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా..పాత పెన్షన్ సాధనే ధ్యేయం గా..సిపిఎస్ అంతం కోసం ఉద్యమం ఉదృతం చేస్తామని భాగస్వామ్య పింఛను పథకం ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ స్పష్టం చేశారు.భారీ వర్షం సైతం లెక్క చేయక ఆదివారం నాడు ఆయన హైదరబాద్ అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ లో అమర వీరుల స్తూపం వద్ద.. సిపిఎస్ అంతం మా పంతం అంటూ నినదించారు. దశాబ్ద కాలంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం అని ఆయా రాజకీయ పార్టీలు ఉద్యోగ, ఉపాధ్యాయ లోకానికి హామి ఇస్తూ పబ్బo గడుపుకుంటున్నాయే తప్ప ఆచరణలో .. మీన మేషాలు లెక్కిస్తున్నాయనీ అవేదన వ్యక్తం చేశారు. పాత పెన్షన్ సాధన ఓ యజ్ఞం, యాగంలా పరిణమించిందని రఘునందన్ అభిప్రాయ పడ్డారు. దేశ వ్యాప్తంగా కోటి మంది ఉద్యోగులు న్యూ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం ముక్త కంఠంతో ఘోషిస్తున్నారని మాచన రఘునందన్ వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షంలోనే తడుస్తూ.. అమర వీరుల స్తూపం వద్ద కూర్చున్నారు. సాధనా శూరత్వం కలిగి ఉంటేనే పాత పెన్షన్ పునరుద్ధరణ సాధ్యం అని రఘునందన్ అభిప్రాయపడ్డారు.

Loading

By admin

Exit mobile version