TwitterWhatsAppFacebookTelegramShare

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తూ యాజమాన్యం చర్యలు చేపట్టింది. అన్నిచోట్ల అంతర్గత ఏరియా స్థాయి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయాలని మూడు రోజుల క్రితం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.. పని స్థలాల్లో ఫిర్యాదు చేయడానికి ఇప్పటివరకు అంతర్గత ఫిర్యాదుల విభాగం ఏరియా స్థాయిలో లేదు. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఈ కమిటీల ఏర్పాటుకు ఆయా ఏరియాల జీఎంలను పురమాయించింది. తక్షణమే కమిటీలను ఏర్పాటు చేసి వాటి వివరాలను సూచిక బోర్డులపై ప్రదర్శించాలని ఆదేశించింది. లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 ప్రకారం ఆయా కమిటీల ఛైర్‌పర్సన్‌లు, సభ్యుల పేర్లు, హోదా, ఫోన్‌ నంబర్‌ వివరాలను అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Loading

By admin

Exit mobile version