TwitterWhatsAppFacebookTelegramShare

గురుకులాల నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలి

గురుకులాలలో ఎక్కడ డార్క్ ఏరియా ఉండకుండా చర్యలు

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం వేడి వేడిగా అందించాలి

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ, బిసి మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న సంక్షేమ హాస్టల్, రెసిడెన్షియల్ గురుకులాల, కేజిబీవి నిర్వహణ పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సంబంధిత హాస్టల్ వార్డెన్ లు, గురుకులాల ప్రిన్సిపాల్ లతో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో సంక్షేమ హాస్టల్స్, రెసిడెన్షియల్ గురుకులాలలో పారిశుధ్య నిర్వహణ, విద్యార్థులకు అందించే ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ గా ఉండాలని, వర్షా కాలం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఈగలు, దోమలు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టల్ పరిసరాల్లో ఎక్కడ చుక్క నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో ఎక్కడ డార్క్ ఏరియా ఉండవద్దని, ప్రతి చోట లైట్ ఉండాలని కలెక్టర్ తెలిపారు. త్రాగు నీటి సరఫరా నాణ్యతను పరిశీలించాలని అన్నారు.రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు. హస్టల్స్ పరిసరాలలో ఎక్కడైనా పాములు, తేలు వంటి విషపు జీవాలు సంచారం ఉందా పరిశీలించాలని, ఒక వేళ ఎక్కడైనా విష జీవులను గుర్తిస్తే వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రస్తుతం వైరల్ జ్వరాల వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ఏఎన్ఎం ల ద్వారా విద్యార్థులకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, గురుకులాలలో అవసరమైన మందులు అందుబాటులో పెట్టాలని , వైరల్ జ్వరాలు లక్షణ గల పిల్లలకు వెంటనే వైద్య సహాయం అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆహారం తీసుకునే ముందు , బాత్ రూం వినియోగించిన తర్వాత చేతులను విద్యార్థులు తప్పనిసరిగా శుభ్రం చేసుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు.రెసిడెన్షియల్ గురుకులాలు, సంక్షేమ హస్టల్స్ లలో స్టాఫ్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా వార్డెన్స్ చూడాలని, విద్యార్థులకు అందించే ఆహారం వేడిగా ఎప్పటికప్పుడు తయారు చేసి అందించాలని, నిల్వ ఉంచిన భోజనం పెట్టవద్దని, వంటకు నాణ్యమైన సామాగ్రి , తాజా కూరగాయలను వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు.విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, రెసిడెన్షియల్ గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ లలో ఫుడ్ పాయిజన్ వంటి అవాంఛనీయ ఘటనలు జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని, ప్రిన్సిపాల్స్ , హస్టల్ వార్డెన్ లు బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు

Loading

By admin

Exit mobile version