జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై మాట్లాడటం జరిగింది ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్న అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పడం జరిగింది విద్యార్థుల మృతి యావత్తు ప్రభుత్వాన్ని కలిచివేసింది రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రజా ప్రభుత్వం పై ఉన్నందునే ఈరోజు జరిగిన విషయాలను నేరుగా తెలుసుకోవడానికి పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వెళ్లాను.
తల్లిదండ్రుల బాధ ఆవేదన అర్థం చేసుకున్న ప్రభుత్వముగా మాట ఇస్తున్న ఈ పాఠశాలనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం వాటికి అవసరమైన నిధులను కేటాయిస్తాం గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలను ప్రహరీ గోడలతో నిర్మించి అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దుతాంమృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాల్లో ఉద్యోగం కల్పిస్తాం..గత ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది మేము మా ప్రభుత్వంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం.