TwitterWhatsAppFacebookTelegramShare

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం హైవే వద్ద రాత్రి రెండు ట్యాంకర్ల లో డీజిల్ తరలిస్తుండగా విశ్వాసనీయ సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారులు 6 గంటల పాటు రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. ఇదే విషయమమై ఉదయం విస్తృత తనిఖీలు చేయగా నందిగామ బైపాస్ వద్ద ఒక గోదాం లో అక్రమంగా అనుమతులు లేకుండా గుజరాత్ నుండి క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చి ఇక్కడ పనికిరాని అయిల్స్, డిజిల్స్ కలిపి బయోడీజిల్ తయారు చేసి అక్రమంగా వివిధ బంకులకు, దెగ్గరలోని పెద్ద పరిశ్రమలకు తరలిస్తున్నారని గుర్తించిన అధికారులు, నిల్వ ఉంచిన గోదాం పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ కు చెందిన js ఫ్యూయిల్ బంక్ లో తనిఖీలు చేశారు. Js ఫుయల్స్ ఓనర్, అక్రమంగా బయో డీజిల్ నిల్వ ఉంచిన గోదాం ఓనర్ ఒక్కడే కావడం గమనార్హం. నిల్వ ఉంచిన గోదాం ను సీజ్ చేసి .. 12000 లీటర్లతో ఉన్న డీజిల్ టాంకర్లను పోలీసులు స్టేషన్ కు తరలించారు. ఈ దాడులు మనోహర్ కుమార్ రాథోడ్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి ఆధ్వర్యంలో జరిగింది.డిటిలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమ బయోడీజిల్ ను పట్టుకున్న పౌర సరఫరాల శాఖ..

Loading

By admin

Exit mobile version