సివిల్ సర్వీసెస్.. దేశవ్యాప్తంగా ఇది నిరుద్యోగులందరి స్వప్నం.. దీన్ని సాకారం చేసుకోవాలని లక్షల మంది కల. వందల మంది మాత్రమే తమ గమ్యాన్ని చేరుకుంటారు. మేధో సంపత్తి, క్రమశిక్షణ, అంకితభావం ఎంత ఉన్నప్పటికీ అవసరమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ లభించక తమ స్వప్నం దూరమవుతుంటే చూస్తూ మదనపడుతున్న నిరుద్యోగులు ఎందరో ఉన్నారు.టాలెంట్ ఉండి.. కఠోర పరిశ్రమ చేసే తత్వం ఉండి కేవలం ఆర్థిక ప్రతిబంధకాలతో సివిల్ సౌధాన్ని అధిగమించలేక మధ్యలోనే తమ ఇష్టమైన రంగాన్ని వదిలి చిన్నపాటి అవకాశాలతో సర్దుకుపోతున్నారు ఎందరో నిరుపేద యువతీయువకులు
- ఇలాంటి నైపుణ్యవంతులైన, ప్రతిభ కలిగిన తెలంగాణ యువత తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని.. అందుకు ప్రతిబంధకంగా ఉంటున్న ఆర్థిక అవరోధాలను తొలగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు ఇంధన శాఖ మాత్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు సంకల్పించారు.ఇందుకోసం దేశానికి వెలుగులు నింపుతున్న తెలంగాణ కొంగుబంగారం సింగరేణి ద్వారా ప్రతిభావంతులైన యువతీ యువకుల జీవితాల్లోనూ వెలుగురేఖలు నింపేలా వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.
- దేశంలో సివిల్ సర్వీసెస్ లోకి తెలంగాణ యువత ఎక్కువగా చేరేలా ప్రోత్సహించేందుకు, అలాగే వారికి ఎదురయ్యే ఆర్థిక ప్రతిబంధకాలను కొంత మేరకు దూరం చేసేలా సింగరేణి సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్లో ప్రాథమిక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన అర్హులైన తెలంగాణ యువత అందరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించారు.
తద్వారా వారంతా మెయిన్స్ పరీక్షకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, ధీమాగా సన్నద్ధం అయ్యే
అవకాశం ఉంటుంది.ఈ పథకం వల్ల ప్రయోజనం పొంది సివిల్స్ స్థాయికి తెలంగాణ యువత ఎదగడం వల్ల దేశాభివృద్ధికే కాకుండా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న మరెంతో మంది యువతకు స్పూర్తినిస్తారు. తద్వారా దేశ సుస్థిర భవిష్యత్ కు వారు పాటుపడుతారన్న దృఢ విశ్వాసంతో ఈ చరిత్రాత్మక వినూత్న పథకానికి నాంది పలకడం జరిగింది.ఈ పథకం ప్రయోజనాలు పొందడానికి ఈ అర్హతలు ఉంటే చాలు - సింగరేణి కార్పోరేట్ సామాజిక బాధ్యతలో కార్యక్రమంలో భాగంగా ప్రారంభిస్తున్న ఈ పథకం
యొక్క ప్రయోజనం పొందాలంటే కింద పేర్కొన్న అర్హత నిబంధనలు తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థులు జనరల్ (ఈడబ్ల్యుఎస్ కోటా) / బీసీ / ఎస్సీ / ఎస్.టి సామాజికవర్గానికి చెందిన వారై
ఉండాలి.అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి
యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణుడై ఉండాలి - వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షల లోపు మాత్రమే ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
- గతంలో ఈ పథకం ద్వారా ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు
అభ్యర్థులు వారి ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సహ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.
ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అర్హులందరికీ లక్ష రూపాయల సాయం
దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య దాదాపు 14 లక్షలు అని
అంచనా - ప్రతి ఏడాది మన తెలంగాణ రాష్ట్రం నుండి సుమారు 50 వేల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటున్నారని అంచనా
- తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య
సుమారుగా 400 నుండి 500 వరకు ఉంటుంది - ఈ వినూత్న ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హులైన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల విజేతలు అందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ప్రోత్సాహక నగదు అందించడం
జరుగుతుంది. - కోలిండియా లిమిటెడ్ సంస్థ తమ కార్పోరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా నిర్మాణ్ పేరిట ఇదే తరహా పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తోంది. అయితే కోలిండియా పథకానికి, సింగరేణి కాలరీస్ ప్రతిపాదిస్తున్న పథకం విశేషాలు పోల్చి చూస్తే…