TwitterWhatsAppFacebookTelegramShare

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి లో పదిరోజుల క్రితం 9 సంవత్సరాల పాప అదృశ్యం.తల్లి తండ్రులు ఊరంతా వెదికి, పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ ఇచ్చారు. అయితే వారు పోలిస్ జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు.అవి ముగ్గురు మైనర్ల ఇండ్లకు తీసుకెళ్ళాయి. వారిని విచారించగ, ఆడుకుందాం రా అని ఎత్తి పోతల పథకం దగ్గరకు తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి, ఎవరికైనా చెబుతుందని చంపి కాల్వలో వేశాం అని చెప్పారు. వారు చెప్పిన విధంగా గాలింపు చర్యలు చేపట్టారు, కానీ వారు రోజుకు ఒక విధంగా చెప్పడంతో, పిల్లల తల్లి తండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం ఎనిమిది రోజులైనా స్పందించలేదు.అయితే 9వ రోజు నోరు విప్పారు సిఎం, పవన్ కళ్యాణ్, హోం మంత్రి. ఎదో నష్ట పరిహారం చెల్లిస్తాం అని.ఇక్కడ కావాల్సింది ఆ అమ్మాయి తల్లి తండ్రులకు భరోసా ఇచ్చి, మేం ఉన్నాం మీకు అని వెంటనే చెప్పాల్సింది.

మైనర్లు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు    Dr. Radhika Acharya గారి మాటల్లో...

రోజుకు ఒక విధంగా మలుపు తిరుగుతున్న ఈ చిన్నారి కనీసం తల్లిదండ్రులకు చూపుకైనా దొరుకుతుందా అని బాలల హక్కుల సంఘం ప్రశ్న?మైనర్లలో ఇలాంటి ఆలోచనలు రావడానికి అనేక కారణాలుంటాయని సైకాలజిస్ట్ డాక్టర్ రాధిక ఆచార్య గారి మాటల్లో….చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇవ్వడం, వారు ఏం చూస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదు. వస్తున్న సినిమాలు,వెబ్ సీరిస్, సొషల్ మిడియా క్రైంను ప్రేరేపించే విధంగా ఉంటున్నాయి.ఇంట్లోని, సమాజంలోని రకరకాల అంశాలు వయసుకొస్తున్న పిల్లల మీద ప్రభావం చూపుతాయి.ఇంట్లో లేదా చుట్టు పక్కల వాళ్లలో లైంగికంగా చెడు ప్రవర్తన ఉంటే ఆ పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉంది. కొందరు తల్లిదండ్రులు పిల్లల ముందే సన్నిహితంగా ఉంటూ ఉంటారు. చిన్నచిన్న గదుల్లో నివసించే కుటుంబాల్లో తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడం పిల్లల కంట పడొచ్చు. అది వారి మీద ప్రభావం చూపుతుంది’’ అని డాక్టర్ స్రవంతి తెలిపారు.

కొందరు పిల్లల్లో మానసిక సమస్యలు కూడా నేరాలకు పాల్పడేలా దారి తీస్తాయి

‘‘బైపోలార్ డిజార్డర్, కాండక్ట్ డిజార్డర్ వంటి సమస్యలు కొందరు పిల్లల్లో నేరపూరిత ప్రవృత్తిని పెంచుతాయి. వయసు పెరిగే కొద్దీ అది పెరుగుతూ వస్తుంది.తాము చూసింది చేయాలని ప్రయత్నిస్తారు. శృంగారానికి వారి శరీర నిర్మాణం పూర్తిగా తయారు కాకపోయినా ఒకరకమైన ఆనందం కోసం అలా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు.‘‘మన సమాజంలో పిల్లలతో లైంగిక విషయాలను చర్చించడానికి స్కూల్ లో టీచర్లు,ఇంట్లో తల్లిదండ్రులు చేయరు. వాళ్లకు చెప్పే వాళ్లు కూడా ఉండరు, వాళ్లకు వచ్చే సందేహాలు బయట వాళ్లకు కూడా చెప్పు కోలేరు. అలాంటి పిల్లలందరూ జత కలిసి ఫోన్లలో పోర్న్ చూడటం వంటివి చేస్తారు. సినిమాలు, టీవీ షోలలో చూపించే అడల్ట్ కంటెంట్ కూడా పిల్లల మీద ప్రభావం చూపుతుంది’’
పర్యావసానమే ఇలాంటి ఘటనలు.

అనురాధ రావు
ప్రెసిడెంట్
బాలల హక్కుల సంఘం

Loading

By admin

Exit mobile version