TwitterWhatsAppFacebookTelegramShare
  • అధికారుల వేధింపులే కారణమంటూ లేఖ..
  • కామారెడ్డి జిల్లాలో ఘటన
  • కార్యాలయ పని కాకుండా వంట వండిపెట్టే పని చెప్తున్నాడని మనస్తాపం
  • అధికారిని కఠినంగా శిక్షిం చాలని బంధువులు డిమాండ్

    • తహసీల్దార్ కార్యాలయ రికార్డు అసి స్టెంట్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన తెడ్డు ప్రశాంత్ (28) జిల్లాలోని తాడ్వాయి తహసీ ల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఉప తహసీల్దార్ వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సూసైడ్ నోట్ రాసి కన్నాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని రోజులుగా ఉపతహసీల్దార్ తనకు కార్యాలయ విధులు కాకుండా వంట వండిపెట్టే విధులు కేటాయిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ప్రశాంత్ సూసైడ్ నోట్ రాసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. బాధ్యుడైన అధికారిని కఠినంగా శిక్షిం చాలని బంధువులు డిమాండ్ చేశారు. ప్రశాంత కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 23 రోజుల కిందటే కుమా రుడు జన్మించాడు. భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.

Loading

By admin

error: Content is protected !!
Exit mobile version