TwitterWhatsAppFacebookTelegramShare

కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజ కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈయన సేరు బాగా వినిపించింది. గత నెల ఏపీ సచివాలయంలో కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా. దాని తరువాత కేరళలోని త్రిసూర్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న అతనిని…రాష్ట్రానికి రప్పించవలసిందిగా పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. దీన్ని అంగీకరించిన వెంటనే ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు అధికారికంగా కృష్ణతేజను డీఓపీటీగా నియమిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. 

త్వరలోనే కృష్ణతేజ ఆంధ్రాకు వచ్చి ఛార్జ్ తీసుకోనున్నారు. ఈయన గతంలో కేరళ కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ మధ్యే త్రిసూర్‌ జిల్లా కలెక్టర్‌గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్‌ ఆయనను పురస్కారానికి ఎంపిక కూడా చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్‌ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపినందుకు గానూ కృష్ణతేజకు ఈ అవార్డును ఇచ్చారు.

ఇక ఐఏఎస్ కృష్ణతేజ ఆంధ్రాకు చెందిన వ్యక్తి. ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కృష్ణతేజ ఇప్పటికే పలుశాఖల్లో పనిచేశారు. మొదటి నుంచి సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్‌గా కృష్ణతేజ పేరు సంపాదించుకున్నారు. చాలా బాగా పని చేస్తారని కూడా చెబుతారు. అందుకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా కృష్ణతేజను ఆంధ్రాకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు.

Loading

By admin

Exit mobile version