పచ్చని చెట్ల తోనే జీవకోటి మనుగడ, ప్రాణ వాయువుకు మూలాధారం పచ్చదనం అని పౌరసరఫరాల శాఖ రంగారెడ్డి జిల్లా సరఫరా అధికారి మనోహర్ కుమార్ రాథోడ్ ఉద్ఘాటించారు.శుక్రవారం నాడు ఆయన తుర్కయాoజాల్ లోని ఓ పెట్రోల్ బంక్ లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ఎమ్ కే రాథోడ్ మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ సందర్భానుసారం మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ మాట్లాడుతూ.. అధిక సంఖ్య లో చెట్లను పెంచడమే పర్యావరణ పరిరక్షణ అని అన్నారు.చెట్లను నాటడమే కాక వాటితో మైత్రి చేస్తే వృక్ష మిత్రగా ఓ అలౌకిక ఆనందం ఉంటుందని అన్నారు. డిటీ హనుమా రవీందర్ నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు