NPCI ఇంటర్నేషనల్ CEO రితేష్ శుక్లా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికాలో డిజిటల్ వాణిజ్యాన్ని అందించడానికి నెట్‌వర్క్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఆ విధంగా, UAEలో UPI సర్వీస్ ప్రాసెస్ సింపుల్‌గా మారింది.
UAE లోని భారతీయులు, ప్రయాణికులు మరియు పర్యాటకులు పాయింట్-ఆఫ్-సేల్ (POS) టెర్మినల్స్ వద్ద QR కోడ్ ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చు. 2024 లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా అంచనా వేయబడింది. వీరిలో 52.9 మిలియన్ల మంది యూఏఈ ద్వారా ప్రయాణించే అవకాశం ఉంది. అందుకే కస్టమర్ల కోసం ఈ సేవలను ప్రారంభించాం’’ అని చెప్పారు.నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్ మరియు భూటాన్‌లలో ఈ UPI సేవలను NPCI ఇప్పటికే ఆమోదించింది.