TwitterWhatsAppFacebookTelegramShare

నిరుద్యోగులకు శుభవార్త అందించిన రేవంత్ సర్కార్. పార్లమెంట్ ఎన్నికల కారణంగా రాష్ట్ర పరిపాలన స్తంభించిపోయిందని, రెండు వారాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ ప్రకటించింది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఏడాది ఉద్యోగ నియామకాలపై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో టీ-కాంగ్రెస్ ట్విటర్‌లో స్పందిస్తూ గత ప్రభుత్వం పై ఫైరయ్యారు. నిరుద్యోగుల గురించి కేటీఆర్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు చదవడం లాంటిదని దుయ్యబట్టారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమైన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. యువత దశాబ్దాన్ని నాశనం చేసిందని దుయ్యబట్టారు.

గురుకులాలు, పోలీస్, మెడికల్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ బోర్డులు మరియు ఇతర విభాగాల నుండి నోటిఫికేషన్‌లతో పాటు గ్రూప్ 1, 2, 3, 4 అన్ని ఖాళీల కోసం TGPSC ఖాళీల క్యాలెండర్‌ను ప్రచురిస్తుంది. ఖాళీల క్యాలెండర్‌ను ప్రచురించాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రివర్గ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఖాళీలను గుర్తించేందుకు టీజీపీఎస్సీ ఎప్పటికప్పుడు సంబంధిత శాఖలకు లేఖలు రాస్తూ ప్రతి సంవత్సరం ఖాళీల క్యాలెండర్ ప్రచురిస్తుంది. అదే సమయంలో ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్‌-1, 2, 3, 4 సర్వీసు ఉద్యోగాల నోటిఫికేషన్‌ తప్పనిసరిగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.

Loading

By admin

Exit mobile version