TwitterWhatsAppFacebookTelegramShare
  • దళిత పోలీస్ అధికారుల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదు
  • దళిత అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వరు, ఇచ్చిన చోట ఇలాంటి వేదిపులే జరుగుతున్నయి
  • పోలీసు ఉన్నతధికారులు దళిత అధికారుల పట్ల ఈ వివక్ష వీడాలి
  • రక్షకభటులకే రక్షణ లేకపోతే ఎలా?
  • తక్షణమే CI జితేందర్ రెడ్డిని, సిబ్బందిని సస్పెండ్ చేయాలి.
  • లేకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సిద్ధం

ఖమ్మం జిల్లా అశ్వరావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ రెండు రోజుల క్రితం మహబూబాబాద్ లో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యయాత్ననికి పాల్పడటం జరిగింది.ప్రస్తుతం హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చావుతో పోరాడుతున్నడు తన స్థితికి కారణం అక్కడే పని చేస్తున్న CI జితేందర్ రెడ్డి ఇతర సిబ్బంది వేధింపులే అని తెలపడం జరిగింది.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు మాల మహానాడు నిరసన తెలిపింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ.SI శ్రీనివాస్ ఆత్మహత్యయాత్ననికి కారణమైన CI జితేందర్ రెడ్డి ని,ఇతర సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని,SC, ST అట్రాసిటి చట్టం పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ సంఘటనపై తక్షణమే DGP స్పందించాలని కోరారు.CI వేధింపుల వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు.పోలీస్ వ్యవస్థలో దళిత అధికారుల పట్ల వేధింపులు, వివక్షతలు పెరిగాయని అన్నారు.దళిత అధికారులకు సరైన పోస్టింగ్ లు కూడా ఇవ్వడం లేదని ఒక వేల ఇచినట్లైతే అశ్వరావుపేట పరిస్థితులే ఉంటున్నాయని అన్నారు తక్షణమే CI జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్త నిరసన లకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మలమహనాడు రాష్ట్ర నాయకులు బెజ్జం ఐలయ్య,బూడిద నాగరాజు,కందుకూరి వెంకటాద్రి, నాయిని భరత్,గండమల్ల జానీ, తిరుపతి, రామక్రిష్ణ, ఉపేందర్, కార్తీక్, సాయి,రవి,వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

Loading

By admin

Exit mobile version