భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను కలుపు మందు తాగి సూసైడ్ అటెండ్ చేసి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమాచారం అందిన వెంటనే జిల్లా కాంగ్రెస్ నాయకులు లాల్ సింగ్ నాయక్ ఎస్సైని పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో డాక్టర్లకు సహకరించాలని ధైర్యంగా ఉండాలని సూచించారు అదేవిధంగా కుటుంబ సభ్యులను జరిగినటువంటి ఇబ్బందులను తెలుసుకొని ఎస్సై గారికి ఇలాంటి పరిస్థితి రావడం ఎంతో బాధాకరమని అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ ఘటనకు గిరిజన నాయకుడిగా జరిగినటువంటి పరిస్థితులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు దళిత అధికారిని ఎన్నో రకాలుగా అవమానపరిచి చివరికి ఆత్మహత్య చేసుకునేంత ఒత్తిళ్లకు గురి చేశారని శ్రీను తెలిపారని పోలీస్ ఉన్నతాధికారులు ప్రవర్తించిన తీరును పూర్తిగా తప్పు పట్టారు ఈ ఘటనపై CM గారికి పూర్తి స్థాయిలో సమాచారం అందించి ఇందుకు కారకులను కఠినంగా శిక్షించేలా ముందుకు వెళ్తామని త్వరలో దళిత గిరిజన సంఘాలను ఏకం చేసి డీజీపీ గారిని కలుస్తామని దళిత అధికారిపై జరిగిన ఘటనపై బాధ్యులను శిక్షించేంతవరకు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.జిల్లాలో అన్ని శాఖల అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడే బడా వ్యక్తులకు పూర్తిస్థాయిలో సహకరిస్తూ దళిత,గిరిజనులను టార్గెట్ చేస్తున్నారని ఎవరు మాట్లాడితే వారి గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందని ప్రభుత్వ మారిన అన్ని శాఖల అధికారుల ప్రవర్తన తీరు మారలేదని ఆరోపించారు.