పద్మారావు నగర్‌లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నాయని విమర్శించారు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేతో పోల్చితే, 2024లో కాంగ్రెస్ సర్వేలో 62 లక్షల మంది తక్కువగా లెక్కబట్టారని పేర్కొన్నారు. ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నందున కులగణనకు రీ సర్వే అవసరమని స్పష్టం చేశారు.
BCల రిజర్వేషన్
బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని తలసాని పేర్కొన్నారు.
SC వర్గీకరణ
SC వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని ప్రభుత్వం తొలగించాలని, స్పష్టమైన విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.